నిత్యస్పూర్తి
విజయం అరుదైనదేమి కాదు, అందరికి అందుబాటులొనే ఉంటుది। కాని అందరు దానిని సొంతం చేసుకొలేరు. అరుదైన వారికే అది అందుతుది వీరు తమను తాము మలుచుకొని అసాధారణ వ్యక్తులుగ అవతరిస్తుంటారు పరిగెత్తే కాలాన్ని అందివచ్చిన వనరులను, అంతర్లీనంగ ఉన్న శక్తి సామర్ధ్యాలను వినియోగించుకున్న వారే విజేతలుగా గుర్తింపు పొందుతున్నారు। వీరు టైమును అస్త్రంగా ప్రయొగిస్తుంటారు। ఉదాహరణకు నిద్రనే తీసుకోండి ఎవరికైనా ఆరు గంటల నిద్ర చాలు ఐతే సాధన చేస్తే తప్ప ఆరు గంటల నిద్రతో సరిపెట్టుకోవడం కుదరదు.అలవాటైనా వేళ కంటే ముందే నిద్ర లేవటం 21 రోజులు సాధన చేస్తే అదొక శక్తివంతమైన అలవాటుగా మారుతుంది। ఎంత ప్రశాంతంగా నిద్రపొయామన్నదే తప్ప ఎంతసేపు నిద్రపొయామన్నది ముఖ్యం కాదు। రోజుకో గంట ఇలా అదనంగా మిగుల్చుకుంటే 30 రోజుల్లో మిగిలే 30 గంటల్లో ఎన్ని పనులు చేయవచ్చొ అలొచించండి. ఇల అదనంగా వచ్చిన గంటను ఆ రోజు రాబోయే వారం ప్రణాలిక కొసమ్ వినియోగించండి ఉదయం గంట సమయమ్ పగటిపూట 2 గంటలతో సమానం. సుర్యోదయ వేళ ఆ గంట మిమ్మలిని ఉత్తేజపరుచుకునేందుకు వినియోగించవచ్చు ఆ రొజు మొత్తాన్ని ఎలా గడపాలో అలోచించడం, చేయవలసిన పనులను క్రమపద్దతిలో అమర్చుకొవడం, ఈ పనులన్నింటిని ఉదయం వేళ చేయవచ్చు. ప్రతి విషయంలో మీరు లీనమవుతారు ప్రతికూల అలోచనలను దరిచేయనీయదు। ఆపాదమస్తకం అత్మవిశ్వాసం నింపుతుంది. అపై విజయాలు మీ అప్తమిత్రులవుతారు.